యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
12-05-2024 12:05 AM
భారతదేశ ఓటర్లలో అధిక భాగం యువతే అనడంలో సందేహం లేదు. తాజాగా ఒక ప్రామాణిక అంచనా ప్రకారం 25 ఏళ్లలోపు వారు 50 శాతం వుండగా, 35 ఏళ్లలోపు వారు 65 శాతం వరకూ వున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణలో యువత అందులో నిరుద్యోగులు 37 లక్షల మంది ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.10 కోట్లు వుండగా, 18 నుంచి 39 ఏళ్లలోపు వారు 1.28 కోట్లు వున్నట్లుగా తెలుస్తున్నది. దీన్నిబట్టి ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్తు పూర్తిగా యువతరం చేతుల్లోనే వున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అందుకే, యువత ఎంతో ఆచి తూచి మంచివారినే తమ ప్రతినిధులుగా ఎన్నుకోవాలి.
డి.రామ్‌గోపాల్, నాగలక్ష్మీనగర్






