2 July, 2026 | 1:27 PM

బస్సులు చాలడం లేదు

12-05-2024 12:05 AM

ఓట్ల కోసం చాలామంది స్వగ్రామాలకు బయల్దేరి వెళుతుండ టం వల్ల హైదరాబాద్ నుంచి మరిన్ని అదనపు బస్సులు జిల్లాలకు వేయాలి. సాధారణంగా మామూలుగానే జిల్లాలకు నగరం నుంచి బస్సుల కొరత వుంటుంది. ఇప్పుడు ఈ ప్రత్యేక పరిస్థితు ల్లో చాలినన్ని బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తున్నది. ప్రైవేటు వాహనాలలో ప్రయాణాలు సురక్షితం కాకపోవడమే కాక డబ్బులు కూడా అదనంగా వసూలు చేస్తారు. అదనంగా 160 సర్వీసులను ఆన్‌లైన్‌లో పెట్టినట్టు వార్తలైతే వచ్చాయి. బస్టాండ్లలో రద్దీ ఆందోళన కలిగిస్తున్నది. 

 విరించి కార్తికేయ, సిద్దిపేట