28 July, 2026 | 1:48 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

15-11-2025 03:16 PM

నివాళులు అర్పించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా జయంతి వేడుకలను గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం  వేడుకలు నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, బిర్సా ముండా చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా అని కొనియాడారు. ఇక్కడ డీటీడబ్ల్యూఓ సంగీత, ఏఓ రాంరెడ్డి, డీఎం డబ్ల్యూఓ భారతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, ఎల్డీఎం మల్లికార్జున రావు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.