18-08-2025 05:51:35 PM
సిపిఎం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండె పూడి గ్రామం కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 375 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి గుండాగాని మధుసూదన్ మాట్లాడుతూ... సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, బలుగు బలహీన వర్గాల బహుజనుల హక్కుల కోసం పోరాటం ఆయన తెలియజేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న రఘునాథపాలెం గ్రామం నుండి మొదలుకొని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, పాపన్న గౌడ్ మహారాజు దాదాపు 20 కోటలనూ నిర్మించాలన్నారు. 12 మందితో మొదలుపెట్టిన తన సైన్యం ఒక గెరిల్లా సైన్యం లాగా 12,000 మందితో విస్తరింప చేశాడని తెలిపారు.
సర్వాయి పాపన్న లాంటి రాజుల్ని మనం ఈరోజుల్లో ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన గుర్తు చేశారు, ఈ సమాజంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ పాపన్నలాంటి మహానుభావుల్ని ప్రతి సంవత్సరం మనం ఘనంగా జయంతి వర్ధంతిలను నిర్వహించి పాపనస్పూర్తితో నూతన బహుజన సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి వారు తెలియజేశారు.