24-04-2025 12:29:09 AM
* మున్సిపాలిటీ నుంచి జారీ చేసిన ఔట్ సోర్స్ ఉద్యోగి సుధీర్
* పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు
* పోలీసుల విచారణలో వెలుగు చూసిన వ్యవహారం
* ఇద్దరిని అరెస్ట్ చేసిన సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది
* మూడేళ్ల కాలంలో సుధీర్ జారీ చేసిన సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తాం: నార్సింగి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి వెల్లడి
రాజేంద్రనగర్, ఏప్రిల్ 23: బంగ్లాదేశ్ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్ జారీ చేయడం సంచలనంగా మారింది. దాని ఆధారంగా అతడు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాలు.. నార్సింగి మున్సిపల్ ఆఫీసులో ఔట్సోర్సింగ్ లో సుధీర్ అనే ఉద్యోగి పని చేస్తున్నాడు. అతడు మూడేళ్ల క్రితం వరకు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో పనిచేశాడు. అతడి అనుభవం దృష్ట్యా నార్సింగి మున్సిపాలిటీలో జనన, మరణ ధ్రువీకరణ ధ్రువీకరణ పత్రాల జారీలో విధులు నిర్వహిస్తున్నాడు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడి తనకు బర్త్ సర్టిఫికెట్ కావాలని నార్సింగి మున్సిపాలిటీలో సుధీర్ ను రెండేళ్ల క్రితం ఆశ్రయించాడు. దీంతో సుధీర్ బర్త్ సర్టిఫికెట్ జారీ చేశాడు.
దీని ఆధారంగా అతడు పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల పోలీసుల వెరిఫికే షన్ నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో సికింద్రాబాద్ టాస్క్ ఫో ర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నార్సింగి మున్సిపాలిటీలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ తో పాటు సదరు బంగ్లాదేశ్ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ముఠాలో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది.. ఉన్నత స్థాయిలో ఇంకా ఎవరైనా దీనికి సహకరించారా.. అనే పలు అంశాలపై ఆరా తీస్తున్నారు.
సుధీర్ మహాముదురు
సుధీర్ తప్పుడు పనులు చేయడంలో సిద్ధహస్తుడు అనే ఆరోపణలు ఉన్నాయి. నార్సింగిమున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న సుధీర్ రెండు సంవ త్సరాల క్రితం అప్పటి కమిషనర్ సత్యబాబు డిజిటల్ సంతకంతో ఓ వ్యక్తికి జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశాడు. అది నకిలీదని, దానిపై విచారణ చేస్తున్నామని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ఓ నజర్ వేయాలి..
హైదరాబాద్ మహానగరం శివారులో ఉన్న మున్సిపాలిటీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. వీటిపై సంబంధిత శాఖ ఉన్నతాధి కారులు కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతై నా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇ లా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారని, అతడు విషయం బయటకు రావడంతో తెలిసిందని, మరెన్నో అంశాలు ఇం కా బయటకు రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.
సుధీర్ జారీచేసిన సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తాం: కమిషనర్
నార్సింగి మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది అయిన సుధీర్ మూడేళ్ల కాలంలో జారీ చేసిన సర్టిఫికెట్లు అన్నీ క్యాన్సల్ చేస్తామని బుధవారం కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా అతడు చేసిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని నార్సింగి పోలీసులకు విజ్ఞప్తి చేశామని ఆయన మీడియాకు తెలియజేశారు. మరిన్ని విషయాలు విచారణలో వెలుగు చూస్తాయని పేర్కొన్నారు.