24-04-2025 12:30:16 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. ఏప్రిల్ 23(విజయక్రాంతి): రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని మద్దూరు మండలం జాదవ రావు పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో ఏర్పాటు చేసిన సదస్సుల్లో రైతుల నుంచి వచ్చే సమస్యల వినతులను స్వీకరించాలన్నారు.
సద స్సులో గ్రామానికి సంబంధించిన పహాని, పాత, కొత్త ఆర్ ఓ ఆర్ , సేత్వార్ తదితర భూ రికా ర్డులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. సదస్సు కి ఇప్పటి దాకా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా 26 దరఖాస్తులు వచ్చాయని, వా టిలో 14 అసైన్డ్ భూముల సమస్యలే ఉన్నాయని, మిగతా వాటిలో కొన్ని విరాసత్, మరికొన్ని పేరు మార్పిడి ల సమస్యలు ఉన్నాయని సిబ్బంది తెలిపారు.
సాదా బైనామా లపై దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం ఉన్న ఖాతాలెన్ని అని కలెక్టర్ అడగగా 797 ఖాతాలు ఉన్నాయని డీ.టి. వాసుదేవ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, సర్వేయర్ అశోక్, రెవెన్యూ అధికారులు కమలాకర్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.