calender_icon.png 2 May, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ

24-04-2025 12:28:12 AM

  1. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ:20,000 లంచం డిమాండ్

రూ 10 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన  విద్యుత్ ఏఈ 

వనపర్తి, ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ) : నూతనంగా ఏర్పాటు చేస్తున్న  ఓ రైస్ మిల్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు జిల్లా గణపురం విద్యుత్ శాఖ ఏఈ కొండయ్య రూ. 20 వేల లంచం డిమాండ్ చేసి రూ. 10వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికిపోయిన సంఘటన బుధవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ఎస్ ఈ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది.

ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చ్‌పకారం ఘనపురం మండలం మల్కాపురం గ్రామ శివారులో  నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ  వ్యక్తి తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరిట రైస్ మిల్ నిర్మాణం చేపట్టాడు. ఈ రైస్ మిల్ కు విద్యుత్ సౌకర్యం కల్పించాలని టిఎస్ ఎస్పీడీఎల్ కు డిడి చెల్లించారు. విద్యుత్ శాఖ అధికారులు టెండర్ నిర్వహించి అట్టి పనులను సలీం అనే వ్యక్తికి అప్పగించారు.

పనులు పూర్తిచేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా సదరు కాంట్రాక్టర్  ఏ ఈ కొండయ్యను కోరగా .... రూ 20వేలు డిమాండ్ చేశాడు. పనులు కొనసాగుతున్న సమయంలో.. ఏఈ కొంత (రూ. 30వేలు) లంచంగా తీసుకున్నాడు.. కనెక్షన్ ఇవ్వాలని కోరగా మరో  రూ 20 వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ సలీం ఏసీబీ ని ఆశ్రయించాడు. వారు.. కెమికల్ పూసిన నోట్లను కాంట్రాక్టర్ ఇచ్చి.. లంచం డిమాండ్ చేసిన ఏ ఈ కి ఇవ్వమన్నారు.

బుధవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయం వద్ద ఉన్నాయి సదరు కాంట్రాక్టర్ ను డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడంతో.. అప్పటికే ఏసీబీ అధికారులతో టచ్ లో ఉన్న కాంట్రాక్టర్ వారిచ్చిన డబ్బును ఇచ్చాడు. వాటిని తీసుకొని ప్యాంటు జేబులో పెట్టుకున్న వెంటనే కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ చేయగా.. నోట్లకు ఉన్న కెమికల్ ఏఈ చేతికి అంటున్నట్లు నిర్ధారణ చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

తన విధి నిర్వహణకు రూ పదివేల లంచం డిమాండ్ చేసి తీసుకున్నట్లుగా కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో నిందితుడు ఏ ఈ కొండయ్యను హాజరుపరచనున్నట్లు ఎసిబి డిఎస్పి తెలిపారు. ప్రభుత్వ శాఖ ఏదైనా అధికారులు విధి నిర్వహణలో చేయాల్సిన పనుల కోసం లంచం అడిగితే ఏసీబీకి సమాచారం అందించాలని ఈ సందర్భంగా డిఎస్పి కోరారు.