23 July, 2026 | 12:55 AM

25 వారాలకే శిశువు జననం

23-07-2026 12:23 AM

కొత్త జీవితానిచ్చిన మెడికవర్ వైద్యులు

సికింద్రాబాద్, జూలై 22 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని మెడికవర్ హా స్పిటల్స్ ఎన్‌ఐసీయూ వైద్య బృందం కేవ లం 25 వారాల 3 రోజుల గర్భధారణలో, 816 గ్రాముల బరువుతో జన్మించిన అత్యం త ప్రీటర్మ్ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించి ఆరోగ్యంగా తీర్చిదిద్దింది. గర్భధారణ సమయంలో తల్లికి పీప్రోమ్, తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి క్లిష్ట సమస్యలు ఉండగా, జననం వెంటనే శిశువును ఎన్‌ఐసీయూలో చేర్చి ఆధునిక రెస్పిరేటరీ సపోర్ట్, పీఐసీసీ లైన్, సెంట్రల్ లైన్ ద్వారా టీపీఎన్, తల్లిపాలు, కం గారూ మదర్ కేర్‌తో చికిత్స అందించారు. చికిత్స అనంతరం మెదడులో రక్తస్రావం, ఆర్‌వోపీ వంటి సమస్యలు లేకుండానే శిశువు పూర్తిగా కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఎదుగుతోంది.

ఈ సందర్భంగా డా. దీపా ధరణప్ప శెట్టి, సీనియర్ నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషన్ మాట్లాడుతూ.. అత్యంత ప్రీటర్మ్ శిశువులకు సకాలంలో నాణ్యమైన వైద్యం, తల్లిపాలు, కేఎంసీ, తల్లిదండ్రుల సహకారం అందితే ఆరోగ్యంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. సృజన ఎస్. (సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి అండ్ స్త్రీరోగ నిపుణురాలు, లాపరోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్), డా. మాధవి డొక్కు (సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజికల్ ఆంకాలజిస్ట్, ప్రసూతి అండ్ స్త్రీరోగ నిపుణురాలు), డా. సజితా రెడ్డి (కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషన్), సెంటర్ హెడ్ కృష్ణవేణి, మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రశాంత్ పాల్గొన్నారు.