calender_icon.png 12 July, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ

12-07-2025 12:00:00 AM

  1. ఆయన ఏ పార్టీలో చేరుతారనేదానిపై ఉత్కంఠ
  2. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
  3. హిందుత్వం కోసమే పనిచేస్తానన్న రాజాసింగ్

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): గోషామహల్ ఎమ్మెల్యే రాజీసింగ్ రాజీనామాను బీజేపీ అగ్రనాయకత్వం ఆమోదిం చింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షు డు జేపీ నడ్డా ఆదేశాలతో కూడిన లేఖను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం విడుదల చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించడంతో రాజాసింగ్ శాసనసభ సభ్యత్వంపై కూడా వేటు వేసే యోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.

ఈమేరకు స్పీకర్‌కు లేఖ రాయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. గత నెల 30న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయనకు బరిలో ఉండకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ పార్టీ సభ్యత్వానికి రాజా సింగ్ రాజీనామా లేఖను జాతీయ నాయకత్వానికి పంపారు. అయితే 11 రోజుల తర్వా త ఆ  పార్టీ రాజీనామాను ఆమోదించింది.

హిందుత్వం కోసమే పనిచేస్తా..

ఆయన రాజీనామా ఆమోదించిన తర్వా త రాజాసింగ్ స్పిందించారు. హిందదుత్వం కోసమే తన చివరి శ్వాస వరకు పనిచేస్తానని శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, పార్టీ తనను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింద న్నారు. పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తన రాజీనామాను జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా ఆమోదించినట్టు వెల్లడించారు. ఏ పదవి, అధికారం, వ్యక్తిగత లబ్ధి కో సమో రాజీనామా చేయలేదని, తాను హిం దుత్వం కోసమే పుట్టానని, చివరి శ్వాస వర కు దానికోసమే పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరాలనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గో షామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశా రు. తాను బీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారం లో వాస్తవంలేదన్నారు. 

ఇప్పుడు దారెటు..

రాజీనామా ఆమోదించడంతో ఇప్పుడు రాజాసింగ్ ఏ పార్టీలో చేరుతారనే చర్చ మొదలైంది. హిందుత్వ ఎజెండాపై పనిచేసే పార్టీల్లో బీజేపీకు ప్రత్యామ్నాయంగా శివసేన, జనసేన కనబడుతున్నాయి. జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హిందుత్వాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో రాజాసింగ్ శివసేన లేదా జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

శివసేనతో టచ్‌లో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరోవైపు మళ్లీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తారనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చాక ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.