12-07-2025 12:00:00 AM
మంత్రుల పర్యటనతో కాంగ్రెస్ చేనులో నూతన ఉత్సాహం
ఆమనగల్లు,జులై 11: కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కసితో అభివృద్ధి చేస్తున్నారని మంత్రులు కితాబు ఇస్తూ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించారు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనను చూసి తాము కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేయూతనందిస్తున్నామని మంత్రు లు పేర్కొన్నారు శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గం లోని మాడ్గుల, వెల్దండ, కల్వ కుర్తిమండలంలో రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు భవనాలు,
సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల నుంచి మంజూరైన 250 కోట్లతో చే పట్టే అభివృద్ధి పనులు మాడుగుల మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ దావాఖాన, మాడుగుల నుంచి కోనాపూర్ మాడుగుల నుంచి దేవరకొండ రోడ్, వెల్దండ మండల కేంద్రం నుంచి సిరిసనగండ్ల,కల్వకుర్తి నుంచి కొట్రగెట్ కొట్రగెట్ నుంచి తలకొండపల్లి ఎక్స్ రోడ్ వరకు డబుల్ లెన్ రోడ్డు పనుల కు, కల్వకుర్తి పట్టణంలో వంద పడకల దావఖాన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నిక ల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటి అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలో తండాలు, గ్రామాలకు బీటి రోడ్లను మార్చుతానని ఆయన హామీ ఇచ్చారు. పేదలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేం దుకు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ప్రభుత్వ దావఖానాలను అప్ గ్రేడ్ చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నా రు.
తలకొండపల్లి, కడ్తాల మండల కేంద్రం లో 30 పడకల ప్రభుత్వ దావఖానలు మం జూరు చేయాలని మంత్రి దామోదర్ నరసింహ కు ఎమ్మెల్యే విన్నవించగా దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆయా మండలాల్లో సర్వే చేయించి 30 పడకల దావాఖాన ను మంజూరు చేయిస్తానని హామినీచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న తరుణంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేయడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉ త్సాహం వచ్చినట్లయింది.
ఆయా మండలాల్లో పాల్గొన్న మంత్రుల కార్యక్రమంలో పె ద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర స్పోరట్స్ పర్సన్ బాలాసింగ్, రాష్ట్ర నాయకు లు రామ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్, రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకుడు శుద్ధపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,పిసిసి మెంబర్ ఆయి ళ లో శ్రీనివాస్ గౌడ్, బట్టు కిషన్ రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మా రెడ్డి, అద్దాల రాము లు, పాండుగౌడ్, జగన్ గౌడ్, రమేష్ గౌడ్, సంపత్, రఘు రాములు, జంగయ్య, కేశవులు, శ్రీనివాస్ రెడ్డి, బిక్య నాయక్ లు పాల్గొన్నారు.