11-07-2025 11:59:35 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో ఈనెల 16న వహించే రాయల చంద్రశేఖర్ ప్రధమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచలో స్థానిక టి యు సి ఐ ఆఫీస్ లో రాయల చంద్రశేఖర్ వర్ధంతి సభను, స్థూపా ఆవిష్కరణ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం నిర్వహించాడన్నారు.
కామ్రేడ్ చంద్రశేఖర్ విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాలకు ప్రభావతుడయ్యాడనీ, శ్రీకాకుళ పోరాటాల వెలువ, కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం, వాళ్ళ అన్న కామ్రేడ్స్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) స్ఫూర్తితో పని చేశాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలకు అలాగే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు. రెండు దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడిపాడు అని తాను మరణించే వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే లీగల్ ఆర్గనైజేషన్ లో పార్టీ అభివృద్ధికి, విస్తరణకు కృషి చేశాడన్నారు.