ప్రశాంతంగా నీట్ మోడల్ పరీక్ష
30-04-2024 12:30 AM
మంచిర్యాల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నీట్, ఎప్‌సెట్ మోడల్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భం గా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదునూరి అభినవ్ మాట్లాడుతూ.. ఐఐటీ చుక్కా రామయ్య నేతృత్వంలో ప్రశ్నపత్రాలు తయా రు చేయించి 29 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 120 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు బండి సత్యనారాయణ, ప్రణయ్, ఆకాంక్ష తదితరులు పాల్గొన్నారు.






