calender_icon.png 10 February, 2026 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, బీఆర్‌ఎస్ తోడు దొంగలు

10-02-2026 01:39:28 AM

రాష్ట్ర మైనార్టీ శాఖా మంత్రి అజారుద్దీన్ 

నారాయణఖేడ్, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో బీజెపి బీఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నారాయణఖేడ్లో రోడ్ షో కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, ఖేడ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గజ్జల కాంతం, ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నగేష్ షట్కార్, డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షట్కార్, పిసిసి సభ్యులు కర్ని శ్రీనివాస్, శంకరయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బిఆర్‌ఎస్, బిజెపి తప్పుడు ప్రచారాలను చేపడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం చేసుకుంటుందని అన్నారు. నారాయణఖేడ్ అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో కలిసి ఆయా వార్డులలో ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.