కాషాయ జెండా ఎగరడం ఖాయం
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్
వరంగల్ తూర్పు, మే 4: వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కాశిబుగ్గ చౌరస్తాలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటిం గ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని, బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారా నే రాష్ట్రంలో అభివృద్ధ్ది సాధ్య మైందని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ నెల 8న ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని మోదీ వస్తున్నారని, సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కార్య క్రమంలో పార్టీ నేత విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.




