14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

బీజేపీ అభ్యర్థులకు బీఫాంలు అందజేత

03-02-2026 12:33 AM

షాద్‌నగర్, ఫిబ్రవరి ౨ (విజయక్రాంతి): షాద్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీఫాంలను విడుదల చేసింది. సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తొలి విడతగా 15 మంది అభ్యర్థులకు సంబంధించిన బీఫాంలను విడుదల చేసి స్థానిక నాయకులకు అందించారు. షాద్ నగర్ మున్సిపాలిటీ ఇంచార్జ్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి, నేతలు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, దుష్యంత్ రెడ్డి, రంగయ్య గౌడ్, చెంది మహేందర్ రెడ్డి, డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్, దేపల్లి అశోక్ గౌడ్, కక్కునూరు వెంకటేష్ గుప్తా, మనోహర్ రెడ్డి తదితర నాయకులు స్థానిక అభ్యర్థులకు ఈ బీఫాంలను అందజేశారు.

అభ్యర్థుల జాబితా

వార్డుల వారిగా బీఫాంలను అందుకున్న అభ్యర్థులలో 1వ వార్డు కాసోజి శివ, 2వ వార్డు గడియారం శ్యాంసుందర్, 3వ వార్డు పి. అంజనేయులు, 6వ వార్డు వెంకట్ నాయక్, 7వ వాడు భాస్కర్ పటేల్, 12 శ్రీహరి గౌడ్, 15 పులి రాజేశ్వరి, 16వ వార్డు పల్నాటి స్వప్న, 17వ వార్డు రేవతి దామోదర్ యాదవ్, 19వ వార్డు గజ్జల మహేశ్వరి, 21వ వార్డు క్యామ లక్ష్మీ ప్రసన్న, 23వ వార్డు పద్మ సాయి, 26వ వార్డు అశ్వినీ, 27వ వార్డు మంగ విజయ్ లకు బీఫాంలు అందజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..