03-02-2026 12:33:39 AM
పౌర హక్కుల ప్రజా సంఘం అధ్యక్షురాలు జయవింధ్యాల
ముషీరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): హైదరాబాద్ ఉమెన్ సివిల్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ మహిళల లైంగిక, దోపిడి, మహిళల అక్రమ రవాణా లాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న పాతబస్తీ బాబానగర్‌కు చెందిన నిలో ఫర్ బేగంతో తమకు ప్రాణహాని ఉందని భాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హైదర్ గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పౌర హక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్) అధ్యక్షురాలు జయవింధ్యాల భాధితు లు మహ్మద్ అమీర్ షరీఫ్, అబ్దుల్ వాసీమ్, ఆష్రప్ ఉన్నీసా, మహ్మద్ ఇబ్రహీంలతో కలిసి ఆమె మాట్లాడారు.
ఉమెన్ సివిల్ రైట్స్ పేరిట సంఘం నడుపుతూ యువతులకు ఆశ చూపిస్తూ అరబ్ దేశాలతో పాటు ముంబాయి, పూణే నగరాలకు తరలించి వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం సదరు సంస్థ బండ్లగూడ తదితర ప్రాంతాలలో మహిళ సేవా పేరిట ఆమాయక మహిళలను మోసం చేస్తూ రహాస్యంగా చట్ట విరుద్ధ కార్యకాలపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అయితే ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఉన్న వారు చూసిచూడనట్లు వ్యవ హారిస్తూ నిలోఫర్ బేగంకు వత్తాసు పలుకుతున్నారని, హత్య చేసేందుకు రెక్కి నిర్వహి స్తూ బాధితులను భయభ్రాంతులకు గురుచేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక కంచన్ బాగ్ పోలీసులకు, ఇతర పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పాపన పోవడంలేదని వాపోయారు. స్థానిక పోలీసు వ్యవస్థ దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు ఇక్బాల్ ఖాన్, హైమద్, బాలకిషన్ రావు, మహ్మద్ కాజా తదితరులు పాల్గొన్నారు.