08-10-2025 08:36:27 AM
ఈ నెల 13 బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన?
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by election) అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వివిధ నేతల నుంచి బీజేపీ త్రిసభ్య కమిటీ అభిప్రాయాలు స్వీకరించింది. నివేదికను ఇవాళ సీల్డ్ కవర్ లో రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వనుంది. ఈ నెల న10 బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. త్రిసభ్య కమిటీ నివేదికపై కేంద్రమంత్రులు(Union Ministers) కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, లక్ష్మణ్ చర్చించనున్నారు. కమిటీ ఖరారు చేసిన 3 పేర్లను రామచందర్ రావు అధిష్ఠానానికి పంపనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి ఈ నెల 13న అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు.