calender_icon.png 8 October, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభం

08-10-2025 10:54:36 AM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై(BC reservation) విచారణ బుధవారం ప్రారంభం అయింది. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభిషేక్ సింఘ్వీ వినిపిస్తున్నారు. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇదే విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్లపై సీజే వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైకోర్టులో(Telangana High Court) తేల్చుకోవాలని సుప్రీంకోర్టు పిటిషన్లు డిస్మిస్ చేసిందని ఏజీ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం రిజర్వేషన్లు 67 శాతానికి పెరిగాయి. బీసీలకు 42, ఎస్సీ ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. హైకోర్టు జీఓ జోలికి వెళ్లకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు యధాతధంగా కొనసాగనున్నాయి. జీఓను కొట్టివేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడనుంది.