calender_icon.png 8 October, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్‌చెరులో ఐటీ ఉద్యోగికి రూ. 54 లక్షలు టోకరా

08-10-2025 09:33:05 AM

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) కొత్త ఎత్తుగడలతో ప్రజలకు వల విసురుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో ఐటీ ఉద్యోగికి రూ. 54 లక్షలు టోకరా వేశారు. బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమీషన్ ఇస్తామంటూ మోసం చేశారు. నేరగాళ్లు విడతలవారీగా ఐటీ ఉద్యోగి నుంచి రూ. 54 లక్షలు కాజేశారు. గత నెల 15న ఐటీ ఉద్యోగికి టెలిగ్రామ్ లో సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపించారు. రూ. 5 వేలు పెట్టుబడి పెడితే సైబర్ నేరగాళ్లు రూ. 12 వేలు పంపించారు. నిజమేనని నమ్మి రూ. 54 పెట్టుబడి పెట్టి బాధితుడు మోసపోయాడు. చివరికి ఐటీ ఉద్యోగి పటాన్ చెరు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.