08-10-2025 08:25:09 AM
నేడే విచారణ... అందరి చూపు హైకోర్టు వైపే
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు(BC reservations) 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నంబర్ 9ను సవాస్ చేస్తూ మాధవరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. 42 శాతం రిజర్వేషన్ల జీవో ను కొట్టివేయాలని మాధవరెడ్డి తన పిటిషన్ లో ధర్మాసనాన్ని కోరారు. బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా పలు ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఆర్. కృష్ణయ్య, వీహెచ్, పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లపై హైకోర్టు సీజే ధర్మాసనం నేడు విచారించనుంది.