calender_icon.png 8 October, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐలో చేరికలు

08-10-2025 08:39:41 AM

సిపిఐ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా.

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని అనంతోగు పాతూరు గ్రామ పంచాయతీల కు చెందిన వివిధ పార్టీల నుండి సుమారు 30 కుటుంబాలు సిపిఐ(Communist Party of India) పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని శేషగిరి భవన్లో జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాష సిపిఐ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు. పాతూరు గ్రామపంచాయతీకి చెందిన సనప సీతరాములు గుగ్గెల రాజేందర్ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు చేరగా అనంతోగు పంచాయతీ జిన్నెలగూడెం గ్రామం నుండి సుమారు 15 కుటుంబాలు సీపీఐ కార్యవర్గ సభ్యుల రేపు ఎల్లయ్య జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు గొగ్గెల కృష్ణ మండల కార్యదర్శి కొమరం హనుమంతరావు మండల నాయకులు వజ్జ పగడయ్య ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పట్ల  మండల ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానం వెలకట్టలేనిదని అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో సిపిఐ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఈ సందర్భంగా అన్నారు.

 కమ్యూనిస్టు పార్టీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని భారత దేశ స్వాతంత్ర పోరాటంలో అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి వేలకొలది కమ్యూనిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలు తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించారని వారి రక్త తర్పణలతోటే భారత దేశ స్వాతంత్రం లభించిందన్నారు త తెలంగాణ తొలి మలిదశ పోరాటంలో సంపూర్ణంగా సిపిఐ పార్టీ మద్దతిచ్చి పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు వంద సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో సిపిఐ పార్టీ అనేక పోరాటాలతో నిలబడిందని ఇంత చరిత్ర ఏ పార్టీకి లేదని అధికారంలో ఉంటే పార్టీలో నిలబడతాయి లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే పార్టీలే మన ముందు కనపడుతున్నాయి.

కానీ సిపిఐ పార్టీ వంద సంవత్సరాలలో ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో ప్రభుత్వాలను తట్టుకొని పోరాటాలు చేసి ఉద్యమాల ఊపిరిగా ఉన్నది కనుకనే ఇంకా ప్రజలు అభిమానిస్తున్నారని ఆదరిస్తున్నారని అన్నారు ఇంత ఘనమైన పార్టీలో మనమందరం భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నామని ఏ పార్టీకి అదిరేది బెదిరేది లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పూనెం సూర్యనారాయణ,నవీన్ అబ్బయ్య, కల్తి భద్రం, ప్రభాకర్, గొగ్గల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.