calender_icon.png 8 October, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా

08-10-2025 11:06:07 AM

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల(BC reservations) పెంపు జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వాయిదా వేసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు విచారణను వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది. ఉత్కంఠ రేపిన బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడటంతో అందరూ షాక్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తరుఫున అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న లాయర్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయినట్లు లాయర్లు బెంచ్‌కు తెలిపారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని లాయర్లు ప్రస్తావించారు. ఆరు పిటిషన్లను ఒకేసారి వింటామని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.