calender_icon.png 13 August, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం

11-08-2025 12:00:00 AM

 కొత్తగూడెం,ఆగస్టు 10 (విజయ క్రాంతి): రాష్ట్రంలో బీసీ వి రిజర్వేషన్ 42 శాతానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభు త్వం అడ్డు కుంటుందని ఎన్ ఎస్ యు ఐ నాయకులు అజ్మీర సురేష్ నాయక్ ఆరోపించారు. అందుకు నిరసనగా ఆదివారం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద, ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర మంత్రి అమిత్ షా,దిష్టి బొమ్మ ను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు ఢి ల్లీలో బీసీలకు 42%రిజర్వేషన్లు కల్పించాల ని, తెలంగాణ రాష్ట్రంలో చేసిన చట్టాలను రా ష్ట్రపతి ఆమోదించాలని, ధర్నాలు, నిరసనలు చేస్తున్న.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ, తె లంగాణ బిజెపి నాయకులు బీసీ రిజర్వేషన్ల ను. వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ వేదిక నుండి బీసీ రిజర్వేషన్ల సమస్యను, ప్రతి గల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు . ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు షేక్ నయీమ్, షేక్ అజహార్, ఠాకూర్ తరుణ్ సింగ్, షేక్ మో హిన్, కాటి సందీప్, కొత్తగూడెం టౌన్ యు వజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉర్సు శివ, శరత్, తదితరులు పాల్గొన్నారు.