11-08-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 10 (విజయక్రాంతి):అక్రమంగా తోలుకో... అడిగినం త ఇచ్చుకో.. సహజ వనరులు ఎటు పోతే మాకేంటి... మా జేబులు నిండితే చాలు అ న్నట్లు ఉంది పాల్వంచ మండల, పట్టణ అధికారుల తీరు. సహజ వనరులను సంరక్షించా ల్సిన మైనింగ్,రెవెన్యూ, ఎంపీడీవో, పోలీస్ అధికారులు అక్రమ ఇసుక రవాణా యదేచ్ఛగా సాగుతున్న నీమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
పా ల్వంచ మండలంలో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తాజాగా రంగాపురం భారత్ బెంజ్ షో రూమ్ ఎదురుగా ఉన్న కాలి ప్రాంతంలో అక్రమంగా ఇసుక నిల్వలు దర్శనమిస్తున్నా యి. ఇసుక మాఫియా కిన్నెరసాని వాగు నుండి రాత్రి,పగలు తేడా లేకుండా కష్టపడి ట్రాక్టర్లతో ఇసుకను రంగాపురం సమీపంలో రెండు, మూడు ప్రాంతాల్లో నిల్వలు చేస్తున్నారు.
నిలువ చేసిన అక్రమ ఇసుకను అ నంతరం లారీలతో ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తు దండుకుంటున్నారని ఆరో పణలు వస్తున్నాయి.ఇప్పటికైన సంబంధిత అధికారులు ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలని, సహజ వనరులను సంరక్షించి భూగర్భ జలాలను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.