calender_icon.png 11 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ భవన్ లో పిపిటి ప్రదర్శన

10-08-2025 11:43:36 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హన్మకొండ డిసిసి భవన్ నందు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ అక్రమాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధం చేసిన పిపిటి ప్రదర్శించే కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా లో అవకతవకలు చోటు చేసుకున్నాయని మా అధినాయకుడు రాహుల్ గాంధీ గుర్తించి ఆధారాలతో సహా ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ ఇప్పటి వరకు స్పందించలేదని, ఒక్క నియోజకవర్గం లోనే లక్ష ఓట్లు పెరగటం, ఒకే ఇంటి నెంబర్ పై 200-300 వందల ఓటర్ల నమోదు కావటాన్ని పరిశీలిస్తే అవన్నీ తప్పుడు ఓట్లని అర్థమవుతున్నని పేర్కొన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు మోడీ-అమిత్ షా ఈసీని ఉపయోగించుకుని అనేక అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. గాంధీ కుటుంబం గురించి, వారి త్యాగాల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి మనకు ప్రధానిగా ఉండటం మన దురదృష్టం అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవి శ్రీనివాస్ రావు, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, కార్పొరేటర్ బస్వరాజు శిరీష, శ్రీమాన్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుసుమ వరుణ్, కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.