13-08-2025 08:26:50 AM
హైదరాబాద్: ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) విచారణ ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఆర్జీవీని సుమారు 11 గంటల పాటు ఒంగోలు పోలీసులు విచారించారు. రామ్ గోపాల్ వర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Nara Chandrababu), పవన్, మంత్రి లోకేష్ ను కించపరుస్తూ ఫోటోలు పెట్టారు. ముగ్గురిని కించపరుస్తూ మార్ఫింగ్ ఫొటోలను ఆర్జీవీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అనుచిత పోస్టింగులు వెనుక ఉన్న వ్యక్తులపై పోలీసులు ఆరా తీశారు.
వైసీపీ(Yuvajana Sramika Rythu Congress Party) హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్(AP State FiberNet Limited) నుంచి ఆర్జీవీకి రూ. 2 కోట్లు చెల్లింపులు జరిగాయి. ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి రూ. 2 కోట్లపై పోలీసులు విచారించారు. ఒంగోలు పోలీసుల దర్యాప్తుకు రామ్ గోపాల్ వర్మ సహకరించలేదని పోలీసులు అంటున్నారు. తెలియదు, గుర్తులేదు, పరిచయం లేదంటూ ఆర్జీవీ సమాధానాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఫోన్(Ram Gopal Varma phone)ను అధికారులు సీజ్ చేశారు. ఆర్జీవీ ఫోన్ నుంచి డేటా సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.