13-08-2025 08:41:47 AM
జైపూర్: రాజస్థాన్‌లోని(Rajasthan) బాపి సమీపంలో ఖాతు శ్యామ్ వద్ద ప్రార్థనలు చేసి తిరిగి వస్తున్న ప్రయాణికుల పికప్ వ్యాన్, ట్రైలర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 10 మంది మరణించారని అధికారులు బుధవారం తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారని, మరో తొమ్మిది మందిని చికిత్స కోసం రిఫర్ చేసినట్లు దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్(District Collector Devendra Kumar) తెలిపారు. దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ ఈ సంఘటన గురించి సమాచారం అందిస్తూ.. పది మంది మరణించారని తెలిపారు. "ప్రాథమిక నివేదికల ప్రకారం, బాపి సమీపంలో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారు.
9 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాణీకుల పికప్ వాహనం, ట్రైలర్ ట్రక్ ఢీకొని ప్రమాదం జరిగింది." అని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తులు ఖాటు శ్యామ్ ఆలయం నుండి వస్తున్న భక్తులని ఎస్పీ సాగర్ రాణా మీడియాకి తెలిపారు. మనోహర్‌పూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 10 మంది మరణించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. బాధితులు ఖాటు శ్యామ్ వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత తిరిగి వస్తున్నట్లు చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.