calender_icon.png 2 November, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

02-11-2025 01:28:19 AM

ఓటర్లను బెదిరిస్తున్నారని .. కిషన్‌రెడ్డిపై వ్యాఖ్యలు  చేసినందుకు చర్యలు తీసుకోవాలని వినతి

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి): సీఎం రేవంత్‌రెడ్డిపై ఈసీకి బీజేపీ ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. శనివారం ఎన్నికల సంఘం అధికారులని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ సీ.అంజిరెడ్డి, బీజే పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు తదితరు లు కలిశారు. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడి చేసిన వ్యాఖ్యలపై ఈసీకి వారు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులో ‘రెండుసార్లు ఎంపీ గా గెలిచి మంత్రి అయిన కిషన్‌రెడ్డి మన గల్లీకి ఎప్పుడైనా వచ్చిండా? మన సమస్య లు అడిగిండా, మనమెట్లున్నామో చూసిం డా, ఇయ్యాల ఉప ఎన్నికలు రాంగా నే మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారటా!. సిగ్గుండాలి. జూబ్లీహిల్స్ మీ బా బు జాగిరా, మీ అయ్య జాగిరా బీజేపీ వా ళ్లది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంటింటికి బిచ్చమెత్తుకోవడానికి వచ్చిండ్‌రా’ అని వ్యాఖ్యలు చేసినట్లు వారు పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్, దేశ సైనికులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. అంతేకాకుండా తమకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రద్దు అవుతా యంటూ ఓటర్లను బెదిరిస్తున్నారని.. రేషన్ బియ్యం, 25వేల రేషన్ కార్డులు కట్ చేస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం అమలు కావని పేర్కొనడంపై సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరారు.