31 May, 2026 | 1:30 AM

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

31-05-2026 01:00 AM
  1. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి. సీతారామ్
  2. పొగాకును వినియోగించకూడదని ప్రతిజ్ఞ
  3. ‘వరల్డ్ నో టొబాకో డే’ సందర్భంగా ‘కామినేని’లో అవగాహన

హైదరాబాద్, మే 30(విజయక్రాంతి): యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను ఆకర్షణీయంగా మా ర్కెట్‌లోకి తీసుకొస్తున్నారని, వాటి మాయాజాలానికి గురికాకుండా అప్రమత్తంగా ఉం డాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి. సీతారామ్  సూచించారు. ఆదివారం ప్రపం చ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎల్బీనగర్ కామినేని ఆస్ప త్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి. సీతారామ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పొగాకు వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పొగాకు దూరంగా ఉండి, ఆ రోగ్యకరమైన సమాజం కోసం కృషి చేస్తాం అని ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉం డి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పొగాకు దుష్ప్రభావాలపై అవగాహన పెంచాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పొ గాకురహిత జీవనశైలే మార్గమన్నారు.

కామినేని ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ పల్మనాల జిస్ట్ డాక్టర్ సుభాకర్ కంది మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ థీమ్ ‘అన్మాస్కింగ్ ది అప్పీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్’ యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న నికోటి న్, పొగాకు ప్రచారాల అసలు స్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. డాక్టర్ రవీంద్ర రెడ్డి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ మాట్లాడుతూ పొగాకు నమలడం సురక్షితం అనే అపోహ పూర్తిగా తప్పని, భారతదేశంలో నోటి క్యాన్స ర్ కేసులకు అది ప్రధాన కారణమని తెలిపారు.

అయితే పొగాకు మానేసిన తర్వాత ఏ దశలోనైనా ఆరోగ్య ప్రయోజనాలు ప్రారంభమవుతాయని, కాలక్రమేణా గుండె జబ్బు లు, క్యాన్సర్ ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని వివరించారు. ‘పొగాకుకు నో చెప్పండి.. జీవితానికి యెస్ చెప్పండి’ అనే సందేశంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీ వనశైలిని ఎంచుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో కామినేని అకాడమీ అఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపాల్ డా. సుధీర్ బాబు పాడ్గుల్, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ డీ ఎస్. సౌజన్య, డాక్టర్ భరత్ జానపాటి కన్సల్టెంట్ పల్మనాలజిస్టులు, ఇతర వై ద్య నిపుణులు, నర్సింగ్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.