calender_icon.png 2 November, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎండీసీ సహకారంతోనే గ్లోబల్ మైనింగ్

02-11-2025 01:27:26 AM

సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): ఎన్‌ఎండీసీ సహకారంతోనే గ్లోబల్ మైనింగ్‌లోకి ప్రవేశానికి సంసిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. శనివారం సింగరేణి భవన్‌లో జరిగిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు బలరామ్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అంతర్జాతీయ రంగంలోకి అడుడుగ పెట్టాలన్న లక్ష్యంతో సాగుతున్న సింగరేణి, ఎన్‌ఎండీసీ, భవిష్యత్ ప్రాజెక్టుల్లోనూ భాగస్వామిగా ఉంటుందన్నారు.

దీనిపై ఎన్ ఎండీసీ సీఎండీ అమితాబ్ ముఖర్జీ స్పం దిస్తూ రానున్న రోజుల్లో బొగ్గు రంగంలో సింగరేణి సహకారాన్ని తాము తీసుకోవడానికి, అలాగే ఇతర మై నింగ్ రంగంలో సింగరేణిని భాగస్వామిగా చేసుకోవడంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.