ఒడిశాలో కాషాయం పాగా..!
భువనేశ్వర్, జూన్ 4: ఒడిశాలో నవీన్ పట్నాయక్ కోట బద్దలైంది. ఉత్కల దేశంలో కాషాయ జెండా రెపరెపలాడింది. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక గెలుపు నమోదు చేసింది. మొత్తం 147 సీట్లు ఉన్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ మెజారిటీ మార్కును సులువుగా దాటేసింది. ౮౧ సీట్లలో బీజేపీ గెలుపొంద గా, బిజూ జనతా దళ్ (బీజేడీ) మాత్రం ౪౮ సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ కూడా ఒడిశాలో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభా వం చూపలేకపోయింది.
కేవలం 1౪ సీట్లను గెలుచుకుంది. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 21 సీట్లకు గాను ఏకంగా 19 సీట్లు బీజేపీ గెలుచుకోగా, బీజేడీకి ఘోర పరాజ యం తప్పలేదు. కేవలం ఒకే సీటు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ మాత్రం ఒకే సీటు గెలుచుకుంది. ఒడిశాలో బీజేపీని గ్రాండ్ విక్టరీ వరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలు నిజమయ్యాయి. కాకపోతే లోక్‌సభ ఫలితాల్లోనే ఒడిశాలో బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేకపోయారు.
ఓటమికి కారణాలేంటి?
సాధారణంగా నవీన పట్నాయక్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, క్లీన్ సీఎంగా ఒడిశాలో మంచి పేరే ఉంది. కాకపోతే ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌కు ప్రభుత్వంలో కీలక పోస్టు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీఎం ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే ఉంటూ ప్రభుత్వ పనుల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేడీ గెలిస్తే వీకే పాండియన్ సీఎం సీటుపై కూర్చుంటారంటూ బీజేపీ, కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాయి. దీంతో వీకే పాం డియన్ తన వారసుడు కాదని స్వయంగా నవీన్ పట్నాయక్ ప్రకటించుకోవాల్సి వచ్చింది.
ఎన్నికల ప్రచారంలో నవీన్ పట్నాయక్ చేతులు వణుకుతుంటే పాండియన్ దాచిపెట్టిన వీడియోలు తెగ వైరల్ అయ్యా యి. ఆయన ఆరోగ్యంపై పాండియన్ కుట్ర చేస్తున్నారంటూ ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్యధిక కాలం అధికారంలో ఉండటంతో సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. చివరకు పట్నాయక్ స్పీడ్‌కు కమలం బ్రేకులు వేసింది.






