28 June, 2026 | 3:48 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో బీజేపీ విస్తరించిది

11-04-2025 04:30 PM

అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త కంకణ బద్ధుడై పని చేయాలి..

జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని 16వ వార్డులో గావ్ చలో-బస్తీ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలవడం జరిగింది. స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని, ప్రస్తుతం కేంద్రంలో మూడవ సారి అధికారంలోకి రావడమే కాకుండా, 12 రాష్ట్రాల్లో స్వంతగా అధికారంలో ఉండి, మరో 6 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని అన్నారు.

దేశంలో దాదాపు మూడవ వంతు భూభాగంలో బీజేపీ అధికారంలో ఉందని 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభమై ప్రస్తుతం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో బీజేపీ విస్తరించిందని ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త కంకణ బద్ధుడై పని చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు విపుల్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు వేణు, భరత్, నరేందర్, విజయ్, ప్రవీణ్, భూమేష్, నేహాల్, వసీం, రాజేష్, రాజ్ గోపాల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు