మతోన్మాద భావాలను రెచ్చగొడుతున్న బీజేపీ
డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 1: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjun Kharge) ప్రసంగించిన స్థలాన్ని శుద్ధి పేరుతో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద, మనువాద భావాలను రెచ్చగొడుతున్నారని, ఇది దేశ సమానత్వానికి వ్యతిరేకమని డిసిసి అధ్యక్షుడు ఉన్న కైలాస్ నేత అన్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ లోని హల్ద్వాని పట్టణం కోత్వాలి పోలీస్ స్టేషన్ లో బిజెపి నాయకులు పెట్టిన అక్రమ కేసులు నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల-మత విభేదాలతో దేశంలో అలజడి సృష్టిస్తున్న బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ పై కేసులు పెట్టకుండా రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా కేసులు పెట్టడం బీజేపీ అరాచకానికి నిదర్శనమన్నారు. దేశంలో యువత ‘మోదీ పోవాలి - రాహుల్ రావాలి‘ అంటున్నారని, 2029లో రాహుల్ గాంధీ ప్రధాని తప్పక అవుతారని అన్నారు.
కెసిఆర్ రాజీనామా చేయాలి
గత 3 సంవత్సరాలుగా శాసనసభకు, ప్రజల మధ్యకు రాకుండా ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ (ప్రతిపక్ష నేత) పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోటి 24 లక్షల 40 వేల రూపాయల జీతం తీసుకుని, 22 కోట్ల రూపాయల సౌకర్యాలు పొంది ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని విమర్శించారు.వెయ్యి రోజుల రేవంత్ రెడ్డి ప్రజా పాలన కేసీఆర్ పాలన కంటే 100 రెట్లు మేలని పేర్కొన్నారు. సన్న బియ్యం, సన్న వడ్లకు రూ.500 బోనస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ క్యాంటీన్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, 82 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.2 లక్షల రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, నూతన హ్యాండ్ రోడ్లు లాంటి పథకాలతో తెలంగాణ దేశంలో నంబర్ వన్ గా ఉందని, రేవంత్ రెడ్డి సర్కార్ రెండోసారి వస్తుందని .
సిగ్గులేకుండాబి ఆర్ ఎస్ నిరసన చేపట్టడం శోచనీయమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్, మహిళా జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, శాలిగౌరారం మండల అధ్యక్షుడు చింత ధనుంజయ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోసిరెడ్డి సంతోష్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, ఏళ్ల రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.






