2 September, 2026 | 2:42 AM

ముచ్చట్లు పెట్టేందుకు రాలేదు...జిల్లా వైద్య అధికారి నాగేంద్ర

02-09-2026 | 01:52am

బెజ్జూర్ సెప్టెంబర్ 1, (విజయ క్రాంతి ) ముచ్చట్లు పెట్టేందుకు రాలేదని సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని జిల్లా వైద్యాధికారి నాగేంద్ర(District Medical Officer Nagendra) అన్నారు. బెజ్జూర్ మండలంలోని ఊట్ సారంగపల్లి సబ్ సెంటర్ పరిధిలోని మద్దిగూడ గ్రామ సమీపంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. స్థలం అనుకూలంగా ఉందని తెలిపారు.

ఇటీవల వైద్యం వికటించి మర్తిడి గ్రామానికి చెందిన చాలు భాయి మృతి చెందిందని కుటుంబ సభ్యులు పత్రికల్లో తెలిపిన కథనాలను పరిశీలించి నిహారిక మండల్ ప్రైవేటు వైద్యం చేసే ఆవాసానికి వెళ్లగా తలుపులకు తాళాలు వేసి ఉన్నాయని అక్కడ డోర్ పై ఉన్న సెల్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు.

కుటుంబ సభ్యుల వాగ్మూలాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అధిక మోతాదులో డోసులు ఇచ్చి అర్హత లేని వైద్యం చేస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం బెజ్జూర్ సామాజిక ఆసుపత్రికి వచ్చి పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కేసుల వివరాలు, మంత్లీ రిపోరట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికారడ్స్ సక్రమంగా నిర్వహించాలని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని అసలే వర్షాకాలం, సీజనల్ వ్యాధులు సోకుతున్నాయని అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రావణ్ కుమార్,శ్రీనివాస్, సూపర్వైజర్ శారద, హెచ్ వి కమల, హెచ్ ఇ వో వెంకన్న, కోటేష్, శ్యామ్ లాల్, ఏఎన్‌ఎంలు వైద్య సిబ్బంది ఉన్నారు.