calender_icon.png 23 February, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షింతలు పుస్తకావిష్కరణ

23-02-2026 01:08:21 AM

సురేంద్రగజ్జెల మల్లారెడ్డి సంకలనం 

ఖైరతాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): సీనియర్ కార్టూనిస్టు సురేంద్ర, గజ్జెల మల్లారెడ్డి సంయుక్తంగా అందించిన ‘అక్షింతలు’ కార్టూన్ సంకలన పుస్తకావిష్కరణ సభ ఆదివారం ఉదయం సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరిగింది. సభకు మందలపర్తి కిషోర్ అధ్యక్షత వహించారు. గజ్జెల మల్లారెడ్డి కుమారుడు గజ్జెల అశోక్ తన నాన్న రచించిన కవితలను గుర్తుచేసుకుంటూ, ఆ సాహిత్య వారసత్వాన్ని సభికుల తో ఆత్మీయంగా పంచుకున్నారు.

ప్రముఖ కవయిత్రి, జర్నలిస్టు కొండేపూడి నిర్మల మాట్లాడుతూ.. సురేంద్ర మా కుటుంబ సభ్యుడే. కుటుంబంలో ఆయన మెలిగే క్రమశిక్షణ, నిష్ఠ ఆయన కార్టూన్లలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి అని పేర్కొన్నారు. వ్యక్తిత్వంసృజన మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె హృదయపూర్వకంగా వివరించారు. సీనియర్ జర్నలిస్టు తల్లావజుల శివాజీ మాట్లాడుతూ, పాత ‘ఉదయం’ రోజులలో సురేంద్ర, గజ్జెల మల్లారెడ్డితో తమ అనుబంధాన్ని స్మరించుకున్నారు.

సీనియర్ జర్నలి స్టు పాశం యాదగిరి మాట్లా డుతూ.. మల్లారెడ్డి సురేంద్ర కలయికతో వచ్చిన ఈ పుస్తకం ఎంతో బాగుంది. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు అవసరం; ఆత్మను శుద్ధి చేసుకోవడానికి జ్ఞాపకాలు అవసరం అని వ్యాఖ్యానించారు. ‘అక్షింతలు’ అలాంటి జ్ఞాపకాల పుటల సమాహా రమని అభివర్ణించారు. రచయిత తాడి ప్రకాశ్ మాట్లాడుతూ, గజ్జెల మల్లారెడ్డి కేవ లం కవే కాకుండా మంచి వక్త కూడా అని అన్నారు. కార్టూనిస్టు మృత్యుంజయ మా ట్లాడుతూ అప్పటి రాజకీయ పరిస్థితులపై సురేంద్ర ఎంతో ధైర్యంగా కార్టూన్లు గీశారని పేర్కొన్నారు.

ఇప్పుడు అలా గీస్తే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి, కేసులు వేయించే పరిస్థితి ఉంది అని వ్యా ఖ్యానించారు. ఇంత పదునైన కార్టూన్లు గీసినందు కు సురేంద్ర సతీమణి శారదను ప్రత్యేకంగా అభినందించారు. ప్రముఖ కార్టూనిస్టు నర్సిం సురేంద్ర తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కార్టూన్ రంగం లో ఆయన సాధించిన ప్రత్యేక స్థానం గురించి ప్రస్తావించారు. ‘అక్షింతలు’ కేవలం కార్టూన్ సంకలనం మాత్రమే కాదు; అది సమాజానికి అందించిన ఆలోచనా అక్షింతలని సభలో పలువురు వ్యాఖ్యానించారు.