calender_icon.png 23 February, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగేళ్ల బాలుడిపై పడిన వేడివేడి పప్పు

23-02-2026 01:08:53 AM

వంట చేస్తుండగా ఘటన

ఉట్నూర్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని దనోర (బి) గ్రామానికి చెందిన సుష్మా బాయి- గోవింద్ దంపతుల కుమారుడు జగదీష్ (4)పై వేడివేడి పప్పు పడడంతో శరీరంపై బొగ్గలు వచ్చాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం సాయంత్రం తల్లి సుష్మా బాయి వంట వండుతుండగా, తండ్రి జగదీష్ వద్ద ఆడుకుంటున్న బాలుడు తల్లివద్దకు పరుగులు తీశాడు.

ఆ సమయంలో సుష్మా బాయి పొయ్యిపై కాగు తున్న పప్పు గంజును కిందకు దించే క్రమంలో బాబు ఒకేసారి తల్లిని హత్తుకున్నాడు. దీంతో తల్లి చేతిలో ఉన్న పప్పు గంజు బాబుపై పడటంతో చర్మం కాలిపోయింది. గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అం దించడంతో  అంబులెన్స్ ఈఎన్టి ప్రవీణ్, పైలెట్ రాజేష్  సంఘటన స్థలానికి చేరుకొని  బాబును రిమ్స్ కు తరలించారు.