23-02-2026 01:10:19 AM
స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మండలంలోని బరంపూర్ గ్రామ సమీపంలోని కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రథోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం చేపట్టిన రథోత్సవం వేడుకకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తుల తో కలిసి రథోత్సవ శోభయాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, అన్ని సౌకర్యాలు కల్పిస్తానని అన్నారు.
వేలాది మంది భక్తుల మధ్య రథోత్సవం కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై స్వామివారి కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్ర మంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వరరెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, గోవర్ధన్‌రెడ్డి, ముడుపు దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పెద్దఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.