09-09-2025 11:25:52 AM
మెట్ పల్లి,:(విజయక్రాంతి): మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామానికి చెందిన మారంపల్లి శ్రీనివాస్(BJP leader Marepalli Srinivas) (52)తిరుపతి లో గుండె పోటుతో మృతి చెందినట్లు మంగళవారం బంధువులు తెలిపారు.బంధువుల కథనం శ్రీనివాస్ తన మిత్రులతో కలిసి సోమవారం తిరుపతి దర్శనం కోసం బయలు దేరివెళ్లారు.రాత్రి కి తిరుపతికి చేరుకొని అక్కడే గది తీసుకోని ఉన్నారు. మంగళవారం వారి దర్శనం ఉండగా సోమవారం రాత్రి గుండె పోటు వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతుడు శ్రీనివాస్ బీజేపీలో కీలక నేతగా ఉంటూ న్యాయవాది గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా కొనసాగుతున్నాడు. శ్రీనివాస్ కు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉండగా, ఆయన మృతితో గ్రామం లో విశద ఛాయలు అలుముకున్నాయి.