09-09-2025 11:23:13 AM
చిట్యాల, (విజయక్రాంతి): మండలంలోని నైన్ పాక గ్రామంలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం(Prime Minister Kisan Samriddhi Center) వద్ద యూరియా బస్తాల కోసం మంగళవారం రైతులు బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి యూరియా బస్తాల కోసం నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.యూరియా కావాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు.నెల రోజుల నుంచి మండలంలో యూరియా కష్టాలు తప్పడం లేదు అంటున్నారు. ఎండావాన అంటూ తేడా లేకుండా యూరియా కోసం వరుసలో నిల్చుంటున్నాం అంటున్నారు. కేవలం ఆగ్రోస్ కేంద్రానికి 220 బస్తాలు మాత్రమే వచ్చాయని ఒక్కో రైతుకు కేవలం ఒకటి,రెండు బస్తాల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతుకు రెండు యూరియా బస్తాలు ఎలా సరిపోతాయని మండల వ్యవసాయ ధికారులను,జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే రైతాంగానికి అవసరమైన యూరియాను అందించాలని మండల రైతులు కోరుతున్నారు.