calender_icon.png 15 October, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్‌ఫార్మర్ నెపంతో బీజేపీ నేత హత్య

15-10-2025 12:00:00 AM

-మృతదేహం వద్ద లేఖ వదిలిన మావోయిస్టులు 

-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్‌లో ఘటన

చర్ల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బస్తర్‌లో మంగళ వారం మావోయిస్టులు.. ఓ బీజేపీ నాయకుడి ని దారుణంగా హత్యచేశారు. ఇన్‌ఫార్మర్ నెపంతో బస్తర్ ఇల్మిండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజల్కంకేర్ గ్రామానికి చెందిన పూనం సత్యంను హత్య చేశారు. వారి మునుపటి వ్యూహాలను పునరావృతం చేస్తూ మృత దేహం వద్ద ఒక కరపత్రాన్ని వదిలి వెళ్లారు. అందులో అనేక తీవ్రమైన ఆరోపణలు చేశా రు.

మావోయిస్టు మద్దేడ్ ఏరియా కమిటీ ఈ హత్యకు బాధ్యత వహించినట్టుగా పేర్కొన్నా రు. ‘బ్రాహ్మణ హిందూత్వ ఆధారిత బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, మోదీ, విష్ణుదేవ్ సాయి ప్రభు త్వం మార్చి 2026 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా యి. ఈ లక్ష్యం దిశగా, బీజేపీ ప్రతి గ్రామంలో తన సంస్థను బలోపేతం చేస్తోంది. సమాచా రం ఆధారంగా మా పార్టీలపై దాడి చేయడానికి పోలీసు ఇన్‌ఫార్మార్లను సేకరిస్తోంది’ అని మావోయిస్టులు వదిలిన లేఖలో ఉన్నది.