15-10-2025 12:00:00 AM
భద్రతాదళాలను హతమార్చేందుకు మావోయిస్టుల భారీ వ్యూహం భగ్నం
చర్ల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ర్టమైన ఛతీస్‌గఢ్‌లో మావోయిస్టు భారీ డంపును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భారీ మొత్తంలో ఆయుధాలు, పరికరాలు, 5 ఐడీ బాంబుల లభ్యమయ్యాయి. దీంతో మావోయిస్టుల భారీ వ్యూహాన్ని భగ్నం చేశాయి. ఛతీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తాడ్పాల గ్రామంలో కోబ్రా 206, సీఆర్పీఎఫ్ 229, 153, 196ల సంయు క్త బృందం తడ్పాలా బేస్ క్యాంప్ నుంచి కేజీహె ఫుట్‌హిల్స్ ప్రాంతంలో ఒక శోధన ఆపరేషన్ నిర్వహించింది.
మధ్యాహ్నం 3 గంటలకు మావోయిస్టులు దాచిపెట్టిన భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, బీజీఎల్ తయారీకి సంబంధించిన సామగ్రిని స్వాధీ నం చేసుకున్నారు. 51 లైవ్ బీజీఎల్ ముక్క లు, 100 కట్టల హెటీ అల్యూమినియం వైర్, 50 స్టీల్ పైపు ముక్కలు (బీజీఎల్ తయారీ కోసం) పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్, 20 ఇనుప షీట్ ముక్కలు, 40 ఇనుప ప్లేట్ ముక్కలు, శోధన ఆపరేషన్ సమయంలో, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు మావోయిస్టులు అమర్చిన 5 ప్రెషర్ ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బీడీ బృందం సహాయంతో సురక్షితంగా కూల్చివేశారు. భద్రతా దళాల అప్రమత్తత, ప్రభావ వంతమైన చర్య కారణంగా మావోయిస్టుల ప్రణాళికలు విఫలమయ్యాయి. ఈ ప్రాంతం లో నిరంతరం పెట్రోలింగ్, శోధన కార్యకలాపాలు జరుగుతున్నాయి.