calender_icon.png 18 January, 2026 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీ భీమేశ్వర స్వామి ఉత్సవాలు

18-01-2026 05:58:55 PM

శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకుడు పైడి ఎల్లారెడ్డి 

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. మాఘ అమావాస్య సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

జిల్లాలోని ప్రజలు తరలివచ్చి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న భీమేశ్వర వాగులో ప్రత్యేక స్నానాలు ఆచరిస్తారు. ఉత్తరం నుంచి దక్షిణ వైపుకు వాగు ప్రవహిస్తుందడంతో ఈ వాగులో పుణ్యస్నానాలు చేస్తే మంచి పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తారు. దక్షిణం వైపుకు వాగు ప్రవహిస్తునడంతో పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మండలంలోని చిట్యాల, నందివాడ, సంతాయిపేట, ఆరుగొండ, బసనపల్లి, ఎర్రపహాడ్ తాడ్వాయి కృష్ణాజివాడి, కరడ్పల్లి, కన్ కల్, బ్రాహ్మణపల్లి గ్రామాల భక్తులే కాకుండా చుట్టుపక్కల మండలాలైన లింగంపేట,

గాంధారి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మెదక్, కామారెడ్డి, సదాశివ నగర్, భిక్కనూరు మండలాల నుంచి భక్తులు తరలివస్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కామారెడ్డి ఆర్టీసీ డిపో వారు కామారెడ్డి బస్టాండ్ నుంచి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే 

శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ ప్రత్యేక పూజలు చేశారు. బిజెపి రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్, పెద్దలు పాల్గొన్నారు