11 April, 2026 | 9:02 PM

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

11-04-2026 07:29 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని పార్కెలగండి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని బిజెపి నాయకులు తంబళ్ల రవి, సత్తుపల్లి శ్రీ గాయత్రి హాస్పిటల్, గ్రామీణ వైద్యులు తేజ ఆధ్వర్యంలో పార్కేలగండి గ్రామాలోగల  స్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎండి, పేషెంట్లను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణి చేసారు.  ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.