02-05-2025 10:37:31 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన కేంద్రం లోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం జణగనన తోపాటు కుల గణనకు కాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న సందర్బంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేశ్వర్ ,రాష్ట్ర ఓబీసీ గీత సెల్ కన్వినర్ వెంకటేష్ గౌడ్, రాష్ట్ర ఎస్టీమోర్చా ఉపాధ్యక్షులు డి. శ్యామ్ రావ్,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి,బీజేపీ జిల్లా మెంబెర్ ఏ. మల్లేష్ యాదవ్, ఓబీసీ మోర్చా నాయకులు ఏ. శ్రీశైలం యాదవ్, ఎంబరి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ జనగననలో భాగంగా కుల గణన కూడా చేయడం బీసీ వర్గాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.
తెలంగాణ లో సంవత్సరం క్రితం నిర్వహించాల్సిన సర్పంచ్ ఎన్నికలు కులగనన చేస్తున్నామని చెప్పి తూ తూ మంత్రంగా కులగనన చేసి లెక్కలలో బీసీలను 10% తగ్గించి బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు.ఇప్పటికైనా తెలంగాణతో పాటు యావత్ భారతదేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేది కేవలం బీజేపీ తోనే సాధ్యం అని కొనియాడారు. అనంతరం బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నేడు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కులగనన ప్రకటన వల్ల బీసీ వర్గాల్లో కోటి ఆశలు చిగురింపజేశారని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డి. ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ నాయక్,డి. సీతారాంరెడ్డి, భానుగౌడ్, రాజ్ కుమార్,అందె అశోక్,వై. శ్రీనివాస్ రెడ్డి, యువనాయకులు యశ్వంత్,కొమ్ము ప్రశాంత్,మహిళా నాయకురాలు ఎన్. రోజా తదితరులు పాల్గొన్నారు.