18 April, 2026 | 7:10 PM

మహిళా బిల్లును వ్యతిరేకించడం చారిత్రాత్మక తప్పిదం

18-04-2026 05:46 PM

మానకొండూరులో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేసిన బిజెపి నేతలు

మానకొండూరు,(విజయక్రాంతి): పార్లమెంట్ లో మహిళా బిల్లు , నియోజకవర్గాల పెంపు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీల వైఖరిని నిరసిస్తూ  శనివారం  మండల కేంద్రమైన మానకొండూరులో పల్లె మీద ప్రధాన కూడలిలో బిజెపి మండలాధ్యక్షులు కందిరాజిరెడ్డి ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించి, రాహుల్ గాంధీ చిత్రపటాన్ని  దహనం చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మీపూర్ ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్,  మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు అవుదరి విజయ మీడియాతో మాట్లాడారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చారిత్రాత్మకంగా తీసుకున్న  చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు,   నియోజకవర్గాల పెంపు బిల్లును వ్యతిరేకించడం హేయమైన చర్య  అన్నారు. రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూలం కిరణ్, మండల ప్రధాన కార్యదర్శులు, భాషబోయిన ప్రదీప్ యాదవ్, ఉపాధ్యక్షులు మీస రమణయ్య, ఎదులాపూరం అశ్విన్ తేజ,  మాచర్ల కోటేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షులు కొండ్ర వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు, యాళ్ల రాజగోపాల్ రెడ్డి, వైద వైదిక్ రావు, పులిచెర్ల మహేందర్, చామంతుల నరేందర్, సాయవేణి సంపత్,గూడ వినోద్ తదితరులు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.