18 April, 2026 | 7:13 PM

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

18-04-2026 05:48 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): పౌష్టిక ఆహారం అందించడం వలన పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగపర్చుకోవాలని డి డబ్ల్యు ఓ శారద అన్నారు. పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్దిపేట అర్బన్ మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.0నుండి 2 సంవత్సరాల వయస్సు పిల్లల ఆరోగ్యం కీలకమని పిల్లకు సరైన పౌష్టికి ఆహారం అందించాలన్నారు.

పిల్లలకు ఫోన్ అలవాటు చేయకూడదని పిల్లలు అన్నం తినే సమయంలో ఆడుకునే సమయంలో ఫోన్లు ఇవ్వడం మంచిది కాదని సూచించారు. ఫోన్ తదేకంగా చూడటం వలన కంటి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మానసిక స్థితి కూడా దెబ్బతిoటుందన్నారు. ఫోన్ నుండి పిల్లలను దూరంగా ఉంచి నేచురల్ ఆట వస్తువులను అందించి ఆరోగ్యంగా ఉండేలా తల్లులు జాగ్రత్త వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో మెనూ ప్రకారంగా ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని చూడాలని అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను పంపి కేంద్రాలను కాపాడుకునేలా తల్లులు చూసుకోవాలని సూచించారు.

ఎప్పటికప్పుడు పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడి కేంద్రం నుంచి తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాల నుండి వచ్చే ఆహారాన్ని కొంతమంది ఉపయోగించుకోవడం లేదు తినడం లేదు. అన్నట్లు సమాచారం ఉందన్నారు. అట్లా కాకుండా ఆరోగ్యంగా,బలంగా ఉండాలి అంటే ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. అందరం బాధ్యత తీసుకొని బలమైన అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను నిర్మించుకోవాలని అన్నారు.