4 May, 2026 | 9:47 PM

పశ్చిమ బెంగాల్, అస్సాం, పూదుచ్చేరి రాష్ట్రాలలో విజయం సందర్భంగా బిజెపి నాయకులు సంబరాలు

04-05-2026 08:25 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా మండల బిజెపి నాయకులు మండలంలోని గోపాల్పేట్ పట్టణంలో టపాకాయలు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి మండల మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందనన్నారు.

దొంగ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆచరణకు నోచుకోని హామీలను ప్రజలు గమనిస్తున్నారని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, బిఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందనన్నారు.బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారనన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమాన్లు,జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీకాంత్, సీనియర్ నాయకులు బోయిని బాలయ్య,నరేందర్ రెడ్డి,కిషన్,కొండ మీరతాయి, భాస్కర్,గణేష్,ఉపాధ్యక్షులు రాజగంగాధర్,నాయకులు రాజు,విష్ణువర్ధన్,ప్రవీణ్, ప్రశాంత్,నందకిషోర్ సాయిబాబా,నాగరాజుగౌడ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.