20-01-2026 05:48:54 PM
పాల్గొన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి ఏకగ్రీవ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్,సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ తో పాటు పట్టణ, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.