20-01-2026 05:56:34 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రజల సౌకర్యం కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం 15 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం పట్టణంలో మార్కెట్ నిర్మించే ప్రాంతాలను సందర్శించి అక్కడ చేపట్టవలసిన నిర్మాణాలపై సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు వీలైనంత త్వరగా మార్కెట్ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు అధికారులు ఉన్నారు