16 April, 2026 | 2:06 AM

ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన మాధవిని కలిసిన బిజెపి నాయకులు

11-06-2025 10:57 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): ఇటీవల హుజూరాబాద్ ఏసీపిగా బాధ్యతలు స్వీకరించిన ఏసిపి వాసంశెట్టి మాధవి(ACP Vasamsetty Madhavi)ని బిజెపి నాయకులు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఏసీపి కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, గంగిశెట్టి రాజు, పైల వెంకటరెడ్డి, నరేష్, శ్రీనివాస్, కొండల్ రెడ్డి, రాజు, సంతోష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.